Chandrababu: పల్నాడు జిల్లా లో పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు..! 5 d ago
ఏపీలో మంగళవారం ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయనుంది. పల్నాడు జిల్లాలోని యల్లమందలో పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఉదయం 11:35 గంటలకు లబ్ధిదారులతో చంద్రబాబు ముఖాముఖి కానున్నారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 1:45 గంటలకు కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామిని చంద్రబాబు దర్శించుకోనున్నారు.